ఇప్పుడంతా హోమ్ ఫుడ్డే: సుశాంత్

Sushant says he is eating only home-made food
Sunday, July 12, 2020 - 22:00

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన టైమ్ లో చాలామంది తెలియక అక్కినేని సుశాంత్ ను ట్యాగ్ చేసి పోస్టులు పెట్టేవారు. అలా తనకు చాలా పోస్టులు వచ్చాయంటున్నాడు సుశాంత్. ఫ్యాన్స్ తో ఛాట్ చేసిన ఈ హీరో.. తన అప్ కమింగ్ మూవీస్ తో పాటు వ్యక్తిగత విశేషాల్ని షేర్ చేసుకున్నాడు.

- అల వైకుంఠపురములో మీ సీన్స్ మిస్సయినందుకు బాధపడుతున్నారా?
సినిమాలో నాకు సంబంధించి మరికొన్ని ఫన్ సీన్స్ ఉన్నాయి. కానీ అవి ఫైనల్ కట్ లో లేవు. కానీ ఫైనల్ అవుట్ పుట్, ఫ్లో చాలా ముఖ్యం. నాకు ఎలాంటి కంప్లయింట్స్ లేవు.

- ఖాళీ టైమ్ లో ఏం చేయడానికి ఇష్టపడతారు?
పాటలు వింటాను

- మీ జీవితంలో క్లిష్టమైన సమయం ఏది?
కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకెళ్లడమే జీవితం.

- టీ లేదా కాఫీ?
రెండూ తాగను. తప్పనిసరిగా తాగాల్సి వస్తే కాఫీ. 

- బయట తింటారా.. పార్శిల్ తెప్పించుకుంటారా?
ఒకప్పుడు బయటకెళ్లి తినేవాడ్ని, 2-3 ఏళ్లుగా పార్శిల్ తెప్పించుకుంటున్నాను. ఇప్పుడు 2-3 నెలలుగా ఇంట్లో ఫుడ్ మాత్రమే తింటున్నాను.

- చిలసౌ సక్సెస్ నుంచి ఏం నేర్చుకున్నారు?
కొన్ని సార్లు ఎలాంటి సక్సెస్ ఫార్ములా లేకుండా సినిమా తీయడమే సక్సెస్ ఫార్ములా. 

- ఇష్టమైన వెబ్ సిరీస్
"హోమ్ ల్యాండ్" బాగుంది. ప్రస్తుతం "ఫౌదా" చూస్తున్నాను. 

- ఈ లాక్ డౌన్ టైమ్ లో నేర్చుకున్న మంచి విషయం?
చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అన్నింటికంటే ముఖ్యమైంది సహనంగా ఉండడం ఎలాగో నేర్చుకున్నాను.