సుశాంత్ దృష్టిలో డాన్సర్లు వీళ్లే

Sushanth names his favorite dancers
Monday, April 13, 2020 - 16:00

హీరోలు తమ అభిమానులతో అప్పుడప్పుడు ఛాట్ చేయడం మామూలే. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఇన్ స్టెంట్ గా సమాధానాలు చెబుతుంటారు. నిన్న అక్కినేని హీరో సుశాంత్ కూడా ఇలానే ఓ చిన్న డిస్కషన్ సెంటర్ ఓపెన్ చేశాడు. తన దృష్టిలో బెస్ట్ డాన్సర్లు ఎవరు, వాళ్లలో ఏ క్వాలిటీ ఇష్టం అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.

సుశాంత్ దృష్టిలో బెస్ట్ డాన్సర్లు ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు ఉన్నారు. వెరైటీ డాన్సుల్లో, స్టయిల్ లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు సుశాంత్. పైగా బన్నీతో కలిసి అల వైకుంఠపురములో సినిమాలో డాన్స్ చేసిన అనుభవం కూడా ఉందిగా.

ఇక స్పీడ్, ఈజ్ విషయంలో ఎన్టీఆర్ ను కొట్టేవాళ్లు లేరంటున్నాడు. అంత స్పీడ్ గా డాన్స్ ఎవ్వరూ చేయలేరంటున్నాడు. అదే విధంగా షార్ప్ నెస్, గ్రేస్ విషయంలో రామ్ చరణ్ డాన్స్ అంటే తనకు ఇష్టం అంటున్నాడు. ఇక చివరగా డాన్స్ లో అఖిల్ అక్కినేని వైబ్స్, వేవ్స్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు. ఇలా ఇంగ్లిష్ లో రకరకాల పేర్లు పెట్టేసి, ఎవ్వర్నీ నొప్పించకుండా అందరు హీరోల్ని కవర్ చేసి తెలివైనోడు అనిపించుకున్నాడు సుశాంత్.