సుశాంత్ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ

Sushanth reveal his break up story
Thursday, May 7, 2020 - 17:15

హీరోలు ప్రేమించరా.. వాళ్లకు లవ్ ఫెయిల్యూర్స్ ఉండవా.. హీరోలైనా వాళ్లకు కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. సుశాంత్ కు కూడా అలాంటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది. ఆ బ్రేకప్ నుంచి బయటకు రావడానికి తనకు నెల రోజులు పట్టిందంటున్నాడు ఈ హీరో.

"ఫస్ట్ క్రష్ లేదని చెప్పను. నాక్కూడా ఉంది. కానీ అది ఫెయిలైంది. అందులోంచి బయటపడ్డానికి నాకు 2 వారాల నుంచి నెల రోజులు పట్టింది. నిజానికి అంత త్వరగా ఆ లవ్ నుంచి బయటపడతానని అనుకోలేదు. కానీ అనుకున్న దానికంటే కాస్త తొందరగానే రికవర్ అయ్యాను. లైఫ్ లో ప్రేమ ఎంత సహజమో బ్రేకప్ కూడా అంతే సహజం. అలా డిలీట్ చేసుకుంటూ వెళ్లాలి. అదే జీవితం. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలు."

ఫ్యామిలీలో నాగచైతన్యతో చాలా క్లోజ్ గా ఉంటాడట సుశాంత్. ఇద్దరూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటారట. అయితే ఎప్పుడైతే నాగచైతన్య, సమంతను పెళ్లాడాడో అప్పట్నుంచి చైతూకు కాస్త దూరమయ్యానంటున్నాడు సుశాంత్.

"ఫ్యామిలీలో నేను నాగచైతన్యతో చాలా క్లోజ్ గా ఉంటాను. అన్నీ చైతన్యతో షేర్ చేసుకుంటాను. గతంలో ముంబయిలో మేమిద్దరం కలిసి 4-5 నెలలు ఒకే రూమ్ లో ఉన్నాం. కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాం. అప్పుడు మరింత బాండింగ్ పెరిగింది. ఏదైనా నేను చైతూతోనే షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే చైతూకు పెళ్లయిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటున్నాను."

"ఇచ్చట వాహనములు నిలపరాదు" అనే సినిమా చేస్తున్నాడు సుశాంత్. దీంతో పాటు మరో యాడ్ కూడా వస్తోందట. ఈ రెండు పబ్లిక్ డొమైన్ లోకి ఎప్పుడు వెళ్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు ఈ హీరో.