2014లో చావు అంచులు చూశా: సుష్మిత‌

Sushmita Sen reveals she had steroids daily
Tuesday, June 4, 2019 - 15:30

ఒక‌పుడు త‌మ అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌వ్వించిన అందెగ‌త్తెలు ఇటీవ‌ల తీవ్ర అనారోగ్యానికి గుర‌యిన ఉదంతాలు చూశాం. మ‌నీషా కోయిరాలా, సోనాలి బెంద్రె...ఇలా ప‌లువురు అందెగ‌త్తెలు క్యాన్స‌ర్‌తో పోరాడారు. తాజాగా మ‌రో భామ కూడా నాలుగేళ్ల క్రితం చావు అంచుల వ‌ర‌కు వెళ్లాన‌ని చెపుతోంది.

తెలుగులో ర‌క్ష‌కుడు వంటి సినిమాల్లో న‌టించిన మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్ 2014లో తీవ్ర అనారోగ్యానికి గుర‌యింద‌ట‌. రెండేళ్ల పాటు స్టెరాయిడ్స్ తీసుకొని బ‌తికింద‌ట‌. లేదంటే ఈపాటికి క‌న్నుమూసేదాన్ని అని తాజాగా ఆమె ఒక ఇంట‌ర్వ్యూలో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. 

40 ప్ల‌స్ ఏజ్‌లో ఉన్న సుష్మితకి పెళ్లి కాలేదు. కానీ ఒక అమ్మాయిని ద‌త్త‌త తీసుకొంది. అలాగే త‌న‌క‌న్నా చాలా చిన్న వ‌య‌సున్న కుర్రాడితో ప్ర‌స్తుతం స‌హ‌జీవ‌నం చేస్తోంది. 

నాలుగేళ్ల క్రితం మాటిమాటికీ కళ్లు తిరిగి పడిపోతుండేదాన్ని. వైద్యులు అపుడు హైడ్రోకోర్టిసోన్‌ అనే స్టెరాయిడ్‌ తీసుకోవాలని సూచించారు. ఎనిమిది గంటలకోసారి స్టెరాయిడ్‌ తీసుకోవాలి. లేకపోతే బతకనని వైద్యులు చెప్పారు. ల‌క్కీగా బ‌తికాను. మృత్యువుతో పోరాడి జ‌యించాను మ‌  కానీ వాటి చాలా బరువు పెరిగాను. నా ఆకారం చూసి ఏదో అయిపోయిందనుకుంటారని బయటికి రాలేదు. అందుకే రెండేళ్లు ఎవ‌రికీ క‌నిపించ‌లేద‌ని అస‌లు విష‌యం చెప్పింది. 

ఇపుడు పూర్తిగా కోలుకున్నాను. ఈ టైమ్‌లో నాకు తోడుగా ఉన్న‌ది త‌న బాయ్‌ఫ్రెండ్ అని చెప్పింది.