చిత్ర నిర్మాణంలోకి శోభారాణి

SVR Media Sobha Rani enters film production
Wednesday, November 13, 2019 - 09:15

ఎస్‌.వి.ఆర్ మీడియా బ్యాన‌ర్‌పై పలు సినిమాలని తెలుగులోకి అనువ‌దించిన నిర్మాత శోభారాణి ఇప్పుడు తెలుగులో స్ట్ర‌యిట్ సినిమాల‌ను నిర్మించ‌నున్నారు. వచ్చే ఏడాది ఏకంగా ఐదు సినిమాల‌ను నిర్మిస్తారట. యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త వారితో ఈ సినిమాల‌ను నిర్మించ‌డానికి ఎస్‌.వి.ఆర్ మీడియా అడుగులు వేస్తుంది. 

``ఇప్ప‌టి వ‌ర‌కు మేం అనువాద సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ద‌గ్గ‌రయ్యాం. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు సినిమాల‌ను నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 2020లో ఐదు సినిమాల‌ను నిర్మించ‌బోతున్నాం.  యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌బోతున్నాం. ఇప్ప‌టికే ఐదు సినిమాల‌కు సంబంధించిన స్క్రిప్ట్స్ సిద్ధ‌మ‌య్యాయి. అందుకోసం ఆస‌క్తిగ‌త న‌టీన‌టులు(హీరో, హీరోయిన్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్స్‌), సాంకేతిక నిపుణులకు ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఆస‌క్తిగ‌ల‌వారు  [email protected] or to the WhatsApp no.s 9000910979 - 9133673367 ల‌కు వారి ప్రొఫైల్స్‌ను పంపాల్సిందిగా కోరుతున్నాం. ఆస‌క్తి, నైపుణ్యం గ‌ల న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ఇదొక మంచి ప‌రిణామంగా భావిస్తున్నాం`` అన్నారు నిర్మాత శోభారాణి .