అమెరికాలో ఖైదీ 150ని దాటనున్న సైరా

Sye Raa to cross Khaidi No 150 in USA?
Friday, October 11, 2019 - 17:00

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా ' తెలుగునాట ఆల్రెడీ భారీ వసూళ్లను అందుకొంది. ఆదివారానికి దసరా సెలవులు ముగుస్తాయి. సో మిగిలిన ఈ మూడు రోజులు ఎంత కుమ్ముకుంటే అంత బెనిఫిట్. ఆ తర్వాత వసూళ్లు నామమాత్రమే. ఇక అమెరికాలో మాత్రం సైరా నిరాశపరిచింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్ బ్రైట్ గా లేదు. అందుకే.. ఈ మూవీకి మంచి రేటింగ్స్ వచ్చినా కూడా వసూళ్ల పరంగా డల్ అనిపించుకుంది. ఇప్పటివరకు 2.33 మిలియన్ డాల్లర్లను రాబట్టింది. ఇంకా లక్ష డాలర్లు కొల్లగొడితే... ఈ మూవీ ఖైదీ నెంబర్ 150 వసూళ్లను దాటగలదు. 

అమెరికా మార్కెట్ లో చిరంజీవి కెరీర్లో ఇప్పటివరకు నెంబర్ వన్ హిట్... ఖైదీ నెంబర్ 150 మాత్రమే. దాన్నీ సైరా అధిగమించే ఛాన్స్ మాత్రం ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఖైదీ వసూళ్ళని దాటొచ్చు. 

సైరా సినిమా చిరంజీవికి నటుడుగా చాలా పేరు తెచ్చింది. ఆయన నటించిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ కి ఈ మూవీ ఒక డ్రీం ప్రాజెక్ట్. గత 12 ఏళ్లుగా తీయాలనుకొని ఇప్పటికీ సాధించారు.