మరోసారి సత్తా చాటిన చిరంజీవి

Sye Raa gets better ratins in Tamil
Thursday, December 12, 2019 - 23:15

చిరంజీవికి సౌత్ లో ఉన్న క్రేజ్ మరోసారి ఎలివేట్ అయింది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళ, కన్నడలో మెగాస్టార్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన తమిళ టీవీ రేటింగ్స్ తో ఈ విషయం మరోసారి రుజువైంది.

రీసెంట్ గా సన్ టీవీలో సైరా నరసింహారెడ్డి తమిళ వెర్షన్ ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేశారు. ఈ సినిమాకు ఏకంగా 15.44 టీఆర్పీ రావడం విశేషం. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ రావడం తమిళ టీవీ చరిత్రలో ఇదే ప్రప్రథమం. 

మొన్నటివరకు ఈ రికార్డు మహేష్ నటించిన స్పైడర్ పేరిట ఉండేది. ఆ సినిమా తమిళ వెర్షన్ కు 13.06 టీఆర్పీ వచ్చింది. ఇప్పుడా రికార్డును చిరంజీవి క్రాస్ చేశారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. బాహుబలి సిరీస్ తమిళ వెర్షన్ కు కూడా ఈ స్థాయిలో రేటింగ్స్ రాలేదు. 

తమిళనాట తెలుగు డబ్బింగ్ మూవీస్ కు వచ్చిన టాప్-5 రేటింగ్స్ ఇవి
సైరా - 15.44 టీఆర్పీ
వన్ నేనొక్కడినే - 13.06
స్పైడర్ - 10.4
బాహుబలి 2 - 10.33
బాహుబలి - 8.66