ఉయ్యాలవాడ వారసుల ఆందోళన

Sye Raa: Uyyalawada family file case
Saturday, September 21, 2019 - 20:15

సైరా సినిమాకి సంబంధించిన ఒక వివాదం ఇంకా నానుతూనే ఉంది. సైరా సినిమా... ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ. ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఐతే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులకి మనీ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదట. కొంతకాలంగా వారు ఆందోళన చేస్తున్నారు. ఇపుడు పోలీసు స్టేషన్‌ ముందు ధర్నా మొదలుపెట్టారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులు నిర్మాత రామ్‌చరణ్‌కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 23 మంది బంధువులకి డబ్బులు ఇస్తామని నిర్మాత చరణ్‌ ఇంతకుముందు ప్రామిస్‌ చేశాడట. అంతేకాదు లీగల్‌గా అగ్రిమెంట్స్‌ కూడా జరిగాయట. ఒక్కోక్కరికి 2 కోట్లు ఇస్తామని చెప్పారట. చట్ట పరంగా అగ్రీమెంట్ తీసుకొని ఇపుడు తప్పించుకుంటున్నారనేది వీరి ఆరోపణ. 

ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు రామ్ చరణ్ ని,  డైరెక్టర్ ని కలిసిన తమకు న్యాయం జరగలేదని బాధితులు అంటున్నారు. గట్టిగా అడిగితే ఏమి చేసుకుంటారో చేసుకొండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని చిత్ర యూనిట్ రివర్స్‌లో బెదిరిస్తోందట. దాంతో జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు ఫైల్‌ అయింది.