సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రారంభం
Submitted by admin on Wed, 2017-12-06 15:31
Syeraa Narasimha Reddy shoot under progress
Wednesday, December 6, 2017 - 15:30

ఎట్టకేలకి మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` బుధవారం సెట్స్ పైకి వెళ్లింది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ మొదలైంది. డిసెంబర్ 22 వరకు ఈ సెట్స్ లో ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆర్ట్ డైరక్టర్ ప్రత్యేకమైన సెట్స్ వేశాడు.
ఈ క్రేజీ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫైట్ మాస్టర్ లీ విట్టేకర్ సారథ్యంలో కీలక యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ హిస్టారికల్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెని నిర్మిస్తోంది.
- Log in to post comments