ప్రేక్షకులదే తప్పు అంటున్న తాప్సి

Taapse blames audiences for nepotism
Sunday, July 5, 2020 - 22:30

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపొజిజంపై భారీ ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా ఇండియా అంతటా బంధుప్రీతిపై జోరుగా డిస్కషన్ సాగుతోంది. దీనిపై ఇప్పటికే ఓసారి తన వెర్షన్ వినిపించిన హీరోయిన్ తాప్సి, తాజాగా మరోసారి స్పందించింది. ఈసారి ఆమె వెరైటీగా తప్పును ప్రేక్షకులపై నెట్టడం విశేషం.

కెరీర్ స్టార్టింగ్ లో నెపొటిజం వల్ల తను కూడా ఇబ్బంది పడ్డానని తెలిపింది తాప్సి. ప్రముఖుల వారసులతోనే సినిమాలు చేయడానికి మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని, అలా తను కొన్ని అవకాశాలు చేజార్చుకున్నానని, ఆ బాధను మాటల్లో చెప్పలేనని చెప్పుకొచ్చిన తాప్సి.. ఈ విషయంలో ప్రేక్షకులది కూడా తప్పుందని వాదిస్తోంది.

సినీ వారసులు నటించిన సినిమాల్ని చూడ్డానికే ప్రేక్షకులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, నెపొటిజం పెరిగిపోవడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చింది తాప్సి. సినీ వారసులు కాకుండా ఇతరులు నటించిన చిత్రాల్ని ప్రేక్షకులు ఓ పట్టాన ఆదరించరని అంటోంది.

ప్రేక్షకులు ఆదరించకుండానే తాప్సి ఇప్పుడు ఈ పొజిషన్ కు వచ్చిందా..? ఈ ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పదు, చెప్పలేదు.