చెత్త కో-స్టార్స్ వాళ్లే: తాప్సి

Taapse talks about worst co-stars
Thursday, November 21, 2019 - 12:00

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచే తాప్సి, ఈసారి మరోసారి చిన్న సంచలనానికి తెరదీసింది. అయితే ఈసారి ఎలాంటి వివాదాలు లేవు. పైకి తిడుతూనే, పరోక్షంగా మెచ్చుకుంటూ మాట్లాడింది ఈ సొట్టబుగ్గల చిన్నది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఇన్నేళ్ల కెరీర్ లో మీరు నటించిన నటీనటుల్లో చెత్త సహనటులు ఎవరనేది ప్రశ్న. ఈ క్వశ్చన్ కు సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ తాప్సి మాత్రం చాలా తెలివిగా సమాధానం చెప్పింది. చెప్పడమే కాదు, అందర్నీ మెప్పించింది  కూడా.

తన చూసిన నటీనటుల్లో అతిచెత్త సహనటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటోంది తాప్సి. జుద్వా సినిమాలో జాక్వెలిన్ తో కలిసి నటించానని, ఆమె అంత హాట్ గా కనిపించడం తన వల్ల కాలేదంటోంది. భవిష్యత్తులో మరోసారి జాక్వెలిన్ తో కలిసి నటించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానంటోంది. ఇక నటుల్లో విక్కీ కౌశల్ ను చెత్త సహనటుడు అంటోంది. అతడితో పోటీపడి నటించడం చాలా కష్టమంటోంది. ఇలా వీళ్లిద్దర్నీ తిడుతూనే పొగిడేసింది తాప్సి. తెలివైన పిల్ల.