తాప్సి క్వారంటైన్ టైమ్ టేబుల్

Taapsee plans timetable for daily chores
Monday, May 11, 2020 - 18:15

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన పని చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎక్కువమంది వెబ్ సిరీస్ లకు అంకితం అయిపోయారు. తాప్సి మాత్రం వీటికి నో చెబుతోంది. ఇంటిపని ఎక్కువగా ఉంటోందని.. అందుకే ఏకంగా టైమ్ టేబుల్ పెట్టుకున్నానని చెబుతోంది.

"చాలా పని పెరిగిపోయింది. క్లీనింగ్ నుంచి కుకింగ్ వరకు నేనే చూసుకుంటున్నాను. దీంతో చాలా టైమ్ దీనికే పట్టేస్తోంది. అప్పటికీ ఖాళీ టైమ్ దొరికితే ఊరికే కూర్చోను. ఏదో ఒక పని పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు నేను బిజీగా ఉండడం ఇష్టం. అందుకే ఉదయం 7.30 నుంచి రాత్రి 10.30 వరకు ఏం చేయాలో టైమ్ టేబుల్ రాసుకున్నాను."

లాక్ డౌన్ వల్ల కొన్ని పనిదినాలు వృధా అవ్వడంతో కొత్త సినిమాలేవీ ఇకపై అంగీకరించనంటోంది తాప్సి. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాల్ని పూర్తిచేయడానికి టైమ్ కేటాయించాలని, ఇకపై సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకోవాలని అంటోంది.

"హసీన్ దిల్ రుబా షూటింగ్  10 రోజులుంది. ముందు అది పూర్తిచేయాలి. ఆ తర్వాత లూప్ లపేటా సినిమాకు షిఫ్ట్ అవ్వాలి. ఈ రెండు సినిమాల తర్వాత మరో రెండు సినిమాల పనులు స్టార్ట్ చేయాలి. ఈ ఏడాది 5 సినిమాలు సైన్ చేశాను. వచ్చే ఏడాదికి మరో 3 ఓకే చేశాను. అవన్నీ ఒక్కొక్కటిగా పూర్తిచేయాలి."

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ముంబయిలోనే తాప్సి ఉంది. పంజాబ్ లోని తన సొంతింటికి ఆమె వెళ్లలేదు. ప్రస్తుతం తన అపార్ట్ మెంట్ లో చెల్లెలుతో కలిసి ఉంటున్నానని స్పష్టంచేసింది తాప్సి.