ఆవకాయ్ పెట్టిన అవంతిక

Tamannaah prepared Avakay Mango pickle during lockdown
Wednesday, June 10, 2020 - 17:00

తమన్న మరోసారి ఫ్యాన్స్ తో టచ్ లోకి వచ్చింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆవకాయ్ పెట్టానని చెబుతున్న మిల్కీబ్యూటీ.. టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిపై సెపరేట్ గా స్పందించింది. చిరంజీవి నుంచి మహేష్, ప్రభాస్ వరకు హీరోలపై తమన్న ఒపీనియన్ ఏంటో చూద్దాం

- ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్
ప్రభాస్ చాలా డెడికేటెడ్. చాలా కూల్. తను ఎంత పెద్ద స్టార్ అనే విషయాన్ని ప్రభాస్ ఎప్పటికీ గ్రహించలేడు. ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఫిమేల్ ఫ్యాన్స్ అతడ్ని చుట్టుముట్టినప్పుడు ప్రభాస్ ఫీలింగ్స్ చూడాలి. చాలా సిగ్గుపడిపోతాడు. క్యూట్ రియాక్షన్స్ ఇస్తాడు. ప్రభాస్ అలా సిగ్గుపడితే నాకిష్టం.

- పవన్ కల్యాణ్ గురించి
పవన్ కల్యాణ్ దమ్మున్న నటుడు. ఫస్ట్ టైమ్ పవన్ తో వర్క్ చేసినప్పుడు భయమేసింది. కానీ ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చారు. ఆయన మాటతీరు నాకు చాలా ఇష్టం. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా నాకు చాలా ఇష్టం. ఓవైపు పవన్, మరోవైపు పూరి గారు.. ఇలా ఇద్దరితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి.

- మెగాహీరోల గురించి
మెగా ఫ్యామిలీ హీరోలతో వర్క్ చేయడం నా అదృష్టం. వాళ్లలో నేను బాగా గమనించిన అంశం ఏంటంటే.. వాళ్లు స్టార్ డమ్ ను ఎప్పుడూ లైట్ గా తీసుకోరు. ప్రతి సినిమాకు చాలా కష్టపడుతుంటారు. చరణ్, చిరంజీవి, పవన్, బన్నీ.. ఇలా అందరిలో నేను ఇది గమనించాను. ఆ ఫ్యామిలీకి నేను చాలా క్లోజ్. నన్ను కుటుంబ సభ్యురాలిగా చూస్తారు. నా జీవితంలో, నా కెరీర్ లో వాళ్లు ఓ భాగమయ్యారు.

- చిరంజీవితో సైరా చేసినప్పుడు ఎలా అనిపించింది
కెరీర్ లో ఈ పొజిషన్ లో ఉన్న టైమ్ లో చిరంజీవి సర్ తో "సైరా" చేయడం నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయడానికి, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా అనుభవం కావాలి. ముందే ఈ ఛాన్స్ వచ్చి ఉంటే ఇంత బాగా చేసి ఉండేదాన్ని కాదేమో. చిరంజీవి గారు లెజెండ్. ఆయన ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తుంటారు.

- మహేష్ బాబుతో వర్కింగ్
మహేష్ బాబుతో వర్క్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. రీసెంట్ గా మహేష్ నటించిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేశాను. ఆయనతో వర్క్ చేస్తున్న ప్రతిసారి ఎంజాయ్ చేశాను.

- కెరీర్ లో కష్టపడి చేసిన పాత్రలు
నిజానికి ఒకటి కాదు, రెండున్నాయి. ఒకటి "బాహుబలి", రెండోది "అభినేత్రి". ఈ రెండు పాత్రలు చేయడానికి చాలా కష్టపడ్డాను. కానీ బాగా ఎంజాయ్ చేశాను.
- స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు
ఇదే విషయాన్ని చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అడిగారు. అందరికీ నేను చెప్పేది ఒకటే. నాకు డాన్స్, మ్యూజిక్ అంటే ఇష్టం. నన్ను ఫాలో అయ్యేవాళ్లందరికీ తెలుసు నాకు డాన్స్ అంటే ఎంతిష్టమో. ఎప్పుడు ఓ స్పెషల్ సాంగ్ వచ్చినా నా డాన్స్ చూపించడానికి దాన్నొక అవకాశంగా భావిస్తాను. అది నాకు ఇష్టం. పైగా నేను చేసిన స్పెషల్ సాంగ్స్ హీరోలతో నేను గతంలో నటించి ఉన్నాను. వాళ్లతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా బాగుంటుంది. స్పెషల్ సాంగ్స్ చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు, అభ్యంతరాలు లేవు.

- లాక్ డౌన్ లో ఆవకాయ్
ఈ లాక్ డౌన్ లో నేను నా ఇంట్లో ఆవకాయ చేశాను. ఆవకాయ్ నా ఫేవరెట్ పికెల్. నాకు ఎన్ని రకాల కూరలిచ్చినా.. ఒక్క ఆవకాయ్ రైస్ ఇస్తే చాలు. అన్నీ వదిలేసి రైస్-ఆవకాయ్ తింటాను. నాకు అంతిష్టం. ఇది చెబుతున్నప్పుడు కూడా నాకు నోరూరుతోంది.

- సక్సెస్ సీక్రెట్
13 ఏళ్లకే నా కెరీర్ స్టార్ట్ అయింది. నాకు ఎందులో బాగా ఆసక్తి ఉందనే విషయాన్ని నేను తొందరగా తెలుసుకున్నాను. దానికి తగ్గట్టుగానే నాకు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. ప్రతిసారి చాలా కష్టపడ్డాను. మనం ఏ పని చేసినా కష్టపడి చేయాలి. అల్టిమేట్ గా మన మనసుకు ఏదిష్టమో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడమే సక్సెస్ సీక్రెట్.