వాళ్ళు అలా కలుసుకున్నారు

Tamannah and Shruti Haasan reveal how they become thick friends
Friday, April 10, 2020 - 11:30

ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్ లో తమన్న-శృతిహాసన్ జంట కూడా ఒకటి. వీళ్లిద్దరూ చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే ఫ్రీ టైమ్ దొరికితే వేరే పనులు పెట్టుకోకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన మిల్కీబ్యూటీ, శృతిహాసన్.. అసలు ఫస్ట్ టైమ్ ఎప్పుడు కలుసుకున్నారు. ఇదే విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్.

"ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్ బ్యాక్ స్టేజ్ లో తమన్నాను తొలిసారి కలిశాను. అదే ఆమెను ప్రత్యక్షంగా చూడడం. అప్పట్నుంచి మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత మెల్లగా బెస్ట్ ఫ్రెండ్స్ లా మారిపోయాం. తమన్నా లాంటి జెన్యూన్ పర్సన్ ను నేను చూడలేదు. ఆమె అంత నిజాయితీ గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. తను మనసులో ఉన్నది ఓపెన్ గా చెప్పేస్తుంది."

తామిద్దరం అంతలా కలిసిపోవడానికి ఓ కామన్ పాయింట్ ఉందంటోంది శృతిహాసన్. నెగెటివ్ అంశాలకు తాము పెద్దగా ప్రాధాన్యం ఇవ్వమని, పక్కవాళ్ళు ఏం అనుకుంటాడనే తలంపు కూడా తామిద్దరికీ ఉండదని చెబుతోంది.

"మా ఇద్దరి మధ్య కామన్ పాయింట్ ఒకటి ఉంది. మేం జనాల గురించి పట్టించుకోం. మరో వ్యక్తి గురించి మాట్లాడుకోం. నెగెటివ్ అంశాల్ని అస్సలు ప్రస్తావించుకోం. ముందు మా లైఫ్ మాకు ఇంపార్టెంట్. మా ఇద్దరి మధ్య కామన్ పాయింట్ అదే అనుకుంటున్నాను. మా కోసం మేం బతుకుతాం."

ఇలా తమన్నతో తనకున్న స్నేహబంధాన్ని బయటపెట్టింది శృతిహాసన్. ఇప్పటికీ ఎప్పటికీ ఇండస్ట్రీ నుంచి తనకు బెస్ట్ ఫ్రెండ్ తమన్నానే అంటోంది