తమన్న ...ఆవకాయ్ బిర్యానీ!

Tamannah learns cooking
Saturday, July 18, 2020 - 10:00

చాలామంది హీరోయిన్లకు వంట గది ఎక్కడుందో కూడా తెలియదు. తమన్న కూడా ఇందుకు మినహాయింపు కాదు. నిత్యం బిజీగా ఉండే తమన్నకు వంట చేయాల్సిన అవసరం రాలేదు. అయితే లాక్ డౌన్ వల్ల ఫస్ట్ టైమ్ కిచెన్ లో అడుగు పెట్టానంటోంది మిల్కీబ్యూటీ.

వంట స్టార్ట్ చేసిన కొత్తలో కిచెన్ లో పంచదార ఎక్కడుందో, టీ పొడి ఏ డబ్బాలో ఉందో కూడా తనకు తెలిసేది కాదని.. ఆ తర్వాత రోజులు గడిచేకొద్దీ మెల్లమెల్లగా కిచెన్ అలవాటైందని చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద ఈ 3 నెలల కాలంలో కొన్ని వంటలు నేర్చుకున్నానని... తనలో కూడా ఓ మంచి కుక్ ఉందనే విషయాన్ని తెలుసుకున్నానని అంటోంది తమన్న. అంతే కాదు ఆవకాయ పచ్చడి కూడా పెట్టడం నేర్చుకుందట.

అయితే వంటలు చేయడమంటే కేవలం టేస్టీగా వండడం మాత్రమే కాదని, వంట పాత్రలు శుభ్రంగా కడుక్కోవడం, కిచెన్ నీట్ గా ఉంచడం కూడా కుకింగ్ లో భాగమేనని చెబుతోంది.

సెట్స్ పైకి వచ్చిన తర్వాత తమన్న, తన చేతి వంటను ఏ హీరోకు రుచిచూపిస్తుందో చూడాలి.