బమ్ చిక్ బమ్ తమన్న

Tamannah shares her yoga session pics
Thursday, July 23, 2020 - 17:30

ఇన్నేళ్లయినా తమన్న గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. అలా అని ఇంత అందం, మంచి ఫిజిక్ ఊరికే రాలేదు. ప్రతి రోజూ తమన్న ఎక్సర్ సైజ్ చేస్తుంది. యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా రిలాక్స్ అవ్వకుండా ప్రతి రోజూ పొద్దున్న యోగా, జిమ్ కు టైమ్ కేటాయిస్తూ గ్లామర్ కాపాడుకుంటోంది. తాజాగా ఆమె కొన్ని యోగా స్టిల్స్ పోస్ట్ చేసింది.

మొన్నటికి మొన్న వర్షంలో తడుస్తూ ఎక్సర్ సైజ్ చేసిన మిల్కీబ్యూటీ.. తాజాగా తన అందమైన యోగా ఫొటోల్ని రిలీజ్ చేసింది. హార్ట్ చక్ర (హృదయ ముద్ర) యోగా చేస్తుండగా క్లిక్ మనిపించిన స్టిల్స్ ఇవి.

Also Check: Tamannaah's Yoga Session Photos

ఆమె యోగా పోజుల సంగతి పక్కనపెడితే.. మేకప్ లేకున్నా తమన్న ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఫొటోలు లైవ్ ఎగ్జాంపుల్ గా నిలుస్తాయి.

ప్రస్తుతం తమన్న షూటింగ్స్ కోసం వెయిట్ చేస్తోంది. గోపీచంద్ సరసన ఆమె నటిస్తున్న 'సీటీమార్' అనే సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమౌతుంది. దీంతో పాటు సత్యదేవ్ తో మరో సినిమా చేయబోతోంది ఈ బ్యూటీ.