ఉన్నమాట చెప్పిన తాప్సీ

నాకంత సీన్‌లేదు అని నిజాయితీగా ఒప్పుకొంది తాప్సీ. బడాయికి పోకుండా నిజం అంగీకరించినందుకు తాప్సీని అప్రిషియేట్ చేయక తప్పదు. ఇంతకీ ఆమె అన్నమాట ఏంటంటే... తాను బాలీవుడ్‌లో ఏ లిస్ట్ స్టార్‌ని కాను. ఇంకా ఆ రేంజ్‌కి ఎదగలేదు అని చెప్పింది. ఏ లిస్ట్ స్టార్ అంటే టాప్ భామల్లో టాప్ అన్నమాట. దీపిక పదుకొనే, ఆలియ భట్, కంగన, ప్రియాంక చోప్రా..వంటి భామలు ఈ లిస్ట్‌లో ఉంటారు.
బాలీవుడ్‌లో తాప్సీకి మంచి విజయాలున్నాయి. ఛస్మే బద్దూర్, పింక్, రన్నింగ్ షాదీ, నామ్ షబానా, జుడ్వా 2.. ఇలా పలు హిట్స్ ఖాతాలో ఉన్నాయి. దాదాపుగా 90 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఆమెకి అక్కడ. ఐతే విజయాలున్నంత మాత్రానా ఏ లిస్ట్‌లోకి ఇట్టే రాలేరు. జనంలో క్రేజ్ కూడా సంపాదించుకోవాలి. తాప్సీకి అదే కొరవడింది. అందుకే నిజాయితీగా తానింకా ఏ లిస్ట్ స్టార్‌ని కాదని ఒప్పుకొంది. ఐతే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక ఆమె మాటలను ప్రచురించిన తర్వాత కొంత ఫ్లేట్ ఫిరాయించింది. తన అన్న మాటలను వక్రీకరించారన్నట్లుగా మాట్లాడింది. జర్నలిజానికి ఏమైంది అని సగటు సెలబ్రిటీల తరహాలో క్లాస్ కూడా తీసుకొంది.
తెలుగులో రీసెంట్‌గా ఆనందో బ్రహ్మ అనే హారర్ కామెడీతో విజయం అందుకొంది. ఐనా మరో తెలుగు దర్శక, నిర్మాత ఆమెని అప్రోచ్ అయితే ఒట్టు.
- Log in to post comments