ముద్దుల తాప్సీ

Tapsee's steamy lip lock
Friday, August 10, 2018 - 16:00

బాలీవుడ్‌కి వెళ్లిన త‌ర్వాత తాప్సీ రెచ్చిపోతోంది. న‌టిగా డేరింగ్‌గా మారింది. ఆమెకి వ‌చ్చే పాత్ర‌లు కూడా అలాగే ఉంటున్నాయి. ఆమె తాజా హిందీ చిత్రం ‘మన్మార్జియాన్’. ఇందులో అభిషేక్ బ‌చ్చ‌న్‌తో పాటు విక్కీ కౌశాల్ న‌టించాడు.

విక్కీని ఆమె తెగ ముద్దులు పెట్టుకొంది ఈ సినిమాలో. తాజాగా విడుద‌లైన ట్ర‌యిల‌ర్‌లోనే బోలేడ‌న్నీ లిప్‌లాక్‌లున్నాయి. ఇందులో ఆమె లిప్‌లాక్ సీన్స్‌లో రెచ్చిపోయింది. నటుడు విక్కీ కౌశల్‌తో ఆమె చేసిన ఆ సీన్స్ చాలా బోల్డ్‌గా ఉన్నాయి.

ఇంత‌కుముందు జుడ్వా 2లోనూ అలాగే రెచ్చిపోయింది. బాలీవుడ్‌లో ఆమెకి ముద్దుల తాప్సీ అనే బిరుదు కూడా వ‌చ్చింది.