ఇలా చూపిస్తే ఆఫర్లొస్తాయా?

Tejaswi is no getting new offers despite steamy photoshoots
Wednesday, July 15, 2020 - 17:00

ఇన్ స్టాగ్రామ్ వేదిక .... హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేసుకునేందుకు ఒక ఫ్లాట్ ఫార్మ్ గా మారింది. దాదాపుగా అందరూ హీరోయిన్లు గ్లామర్ ఫోటోలు అప్డేట్ చేస్తున్నారు. ఐతే, అందులోనూ కొందరు మరి ఓవర్ గా లిమిట్ క్రాస్ అవుతున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూనమ్ పాండేకి పోటీగా మారారా అన్న రేంజ్ లో కొందరు భామలు ప్రతి రోజు తమ కాళ్ళ సౌందర్యాన్ని, తమ ఛాతి సంపదని ప్రదర్శిస్తున్నారు. 

ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్... తేజస్వి మడివాడ

అందాలు అరబోయడంలో చాలా "కమిట్ మెంట్" చూపుతోంది. ఎవ్రీ డే ...ఒక స్కిన్ షో ఫోటో షూట్. అందుకే కాబోలు ... సినిమాలు లేకున్నా 1 మిలియన్ ఫాలోవర్ లు ఉన్నారు. 

కాకపొతే ఈ భామకి సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఎక్సపోజింగ్ ఫోటో షూట్ ల వల్ల సినిమా ఆఫర్లు వస్తాయనుకోవడం భ్రమ. దర్శకులందరూ రామ్ గోపాల్ వర్మలు కారు కదా... నటన పక్కన పెట్టి స్కిన్ షోకి ఇంపార్టన్స్ ఇచ్చేందుకు.