నైజాంలో అదనపు సెలవులు సైరాకి బెనిఫిట్టే!
సైరా సినిమా ఇప్పటికే 10 రోజుల రన్ పూర్తిచేసుకుంది. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కు కూడా దగ్గరైంది. ఇలాంటి టైమ్ లో ఈ సినిమాకు ఊహించని వరం ఒకటి దక్కింది. అదే దసరా సీజన్. అవును.. తెలంగాణలో దసరా సెలవుల్ని పొడిగించారు. ఈ పొడిగింపు ఇప్పుడు సైరాకు మరింత లబ్ది చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే సమ్మె ప్రారంభమై వారం దాటింది. లెక్కప్రకారం, సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోవాలి. కానీ స్కూల్ బస్సుల్ని ఆర్టీసీ యాజమాన్యం తీసుకొని తిప్పుకోంది. పైగా ఇలాంటి టైమ్ లో స్కూల్స్, కాలేజీలు తెరుచుకుంటే అది మరింత ఇబ్బందిని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే సెలవుల్ని 19వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సో.. తెలంగాణలో స్కూల్, కాలేజీ పిల్లలకు మరో వారం రోజులు అదనపు విరామం దక్కిందన్నమాట. ఆర్టీసీ సమ్మెను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం, నైజాంలో సైరాకు ప్లస్ అవుతుందని ట్రేడ్ భావిస్తోంది. నైజాంలో ఈ సినిమాను ఎన్ఆర్ఏ కింద 30 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇక వచ్చేవారం కూడా కలిసిరావడంతో.. నైజాంలో సైరా సినిమా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.
- Log in to post comments