గుండు హన్మంతరావుకి తెలంగాణ సాయం

ప్రముఖ హాస్య నటుడు గుండు హన్మంతరావుకి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. వైద్య చికిత్స కోసం ఐదు లక్షల రూపాయల తక్షణ సాయాన్ని ప్రకటించి తన ఉదారతని మరోసారి చూపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చూసిన వెంటనే స్పందించి... చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసి చెక్‌ని హన్మంతరావు ఇంటికి పంపించారు. గుండు హన్మంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేటీఆర్.
గుండు హన్మంతరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో అపోలో ఆస్పత్రిలో చికిత్స చేరారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లోనే ఉండి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హన్మంతరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి సినీ పెద్దలకు విన్నవించింది. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలు అందించింది.
- Log in to post comments