మళ్లీ ఓవర్ గా ఓవర్సీస్ హక్కులు

Telugu films getting high prices for overseas rights once again
Tuesday, February 4, 2020 - 09:45

సంక్రాంతికి విడుదలయిన "అల వైకుంఠపురంలో" ఏకంగా ఆల్ టైం మూడో అతిపెద్ద హిట్ గా నిలవడంతో... పడిపోయింది అనుకున్న ఓవర్సీస్ మార్కెట్ మరోసారి రెక్కలు కట్టుకొని ఎగురుతోంది. బయ్యర్లకి మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. 'ఓవర్సీస్' మార్కెట్ కి అనుకూలంగా ఉండే  సినిమాలు, దర్సకుల సినిమాలని మళ్ళీ ఎగబడి కొంటున్నారు. ఓవర్ గా రేట్స్ ఇచ్చి కైవసం చేసుకుంటున్నారు హక్కులని. 

లేటెస్ట్ గా శేఖర్  కమ్ముల కొత్త సినిమా భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. త్రివిక్రమ్ లాగే అమెరికా మార్కెట్ లో బాగా పట్టు , క్రేజ్ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు అక్కడ బాగా ఆడుతాయి. కమ్ముల ఇప్పుడు చైతన్య, సాయి పల్లవి జంటగా తీస్తోన్న 'లవ్ స్టోరీ' ఓవర్సీస్ హక్కులు 5 కోట్లకి అమ్ముడు పోయాయి. ఇది భారీ మొత్తమే. ఎందుకంటే చైతన్యకి సోలో హీరో గా ఇంతవరకు మిలియన్ డాలర్ మూవీ లేదు. కేవలం కమ్ముల నేమ్ మీదే సేల్ అయింది. 

ఏప్రిల్ 16న విడుదల కానుంది లవ్ స్టోరీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. డాన్స్ నేపథ్యంగా సాగే లవ్ స్టోరీ ఇది.