తెనాలికి రేటు బాగానే పలికింది

Tenali Ramakrishna gets good price from Satellite rights
Wednesday, November 13, 2019 - 14:30

నిను వీడని నీడను నేనే సినిమా సక్సెస్ అవ్వడం, ఆ మూవీకి డిజిటల్-శాటిలైట్ రైట్స్ కింద మంచి ఎమౌంట్ రావడం తెనాలి రామకృష్ణకు కలిసొచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి ఎమౌంట్ దక్కింది. రిలీజ్ కు సరిగ్గా కొన్ని రోజుల ముందు ఈ సినిమా శాటిలైట్-డిజిటల్ రైట్స్ లాక్ చేశారు. స్టార్ మా ఛానెల్ ఈ సినిమా రైట్స్ దక్కించుంది.

కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా డిజిటల్ రైట్స్ ను కూడా స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. మూవీ విడుదలైన 4 వారాల్లో హాట్ స్టార్ లో పెట్టేలా ఒప్పందం కూడా జరిగిపోయింది. శాటిలైట్, డిజిటల్ రెండూ కలిపి ఈ సినిమా 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

సందీప్ కిషన్ కెరీర్ లో హయ్యస్ట్ నాన్-థియేట్రికల్ మొత్తం ఇదే. గతంలో ఇతడు నటించిన ఏ సినిమాకు ఇంత మొత్తం రాలేదు. సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడం, టీవీ ప్రేక్షకులకు మూవీ కనెక్ట్ అవుతుందనే అంచనాలు వెలువడ్డంతో స్టార్ మా యాజమాన్యం రెండో ఆలోచన లేకుండా అడుగు ముందుకేసింది. నాగేశ్వర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.