టెనెట్ తెలుగు ట్రైలర్ చూశారా?

Tenet Telugu tailer is here
Saturday, July 4, 2020 - 15:00

ఒక తరంలో స్టీవెన్ స్పీల్ బర్గ్ (జాస్, జురాసిక్ పార్క్), జేమ్స్ కామెరూన్ (టైటానిక్, అవతార్) ఎలాగో... ఈ తరానికి గ్రేట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్... క్రిస్టోఫర్ నోలన్. "ది డార్క్ నైట్", "ఇన్ సెప్షన్" చిత్రాల క్రిస్టోఫర్ నోలన్ తీసిన కొత్త చిత్రం... "టెనెట్". కరోనా తగ్గితే వచ్చే నెలలో విడుదల అవుతుంది. మన బాలీవుడ్ సీనియర్ నటి డింపుల్ కపాడియా కూడా నటించింది ఈ బిగ్ హాలీవుడ్ మూవీలో. ఇప్పుడు తెలుగులో ట్రైలర్ వచ్చింది. 

మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అనే ఊహతో తెరకెక్కిన మూవీ ఇది. జేమ్స్ బాండ్ తరహా చిత్రమే కానీ... నోలన్ తరహాలో మైండ్ కి పదును పెట్టే రీతిలోనే ఉంటుంది. ట్రైలర్ కూడా సగం అర్థం కాదు. "టైం ఇన్వర్షన్" (కాల ప్రవాహంలో వెనక్కి వెళ్లడం) అనే కొత్త కాన్సెప్ట్ ని ఇందులో చూపిస్తున్నాడు నోలన్. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.