టెర్మినేటర్ మరోసారి దూసుకొస్తున్నాడు

Terminator in 3D from August 25th
Tuesday, July 18, 2017 - 11:30

జేమ్స్ కామరూన్, ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్ కాంబినేషన్ లో వచ్చిన టెర్నినేటర్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే అంతా కళ్లు అప్పగించేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన ఈ సిరీస్ మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతోంది. అది కూడా హైటెక్ హంగులతో. 

ఇందులో భాగంగా టెర్మినేటర్-2ను త్రీడీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆడియో క్వాలిటీని పెంచారు. సినిమాను త్రీడీలోకి కన్వర్ట్ కూడా చేశారు. ఆగస్ట్25న ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా టెర్మినేటర్-2 సినిమా విడుదలకానుంది. 

అవతార్ తో జేమ్స్ కామరూన్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇక ఆర్నాల్డ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ఈ సినిమాను టీవీల్లో ఇప్పటికే చాలామంది చూసేసినప్పటికీ.. థియేటర్లలో మరోసారి త్రీడీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. ఇది క్లిక్ అయితే, సిరీస్ లో మిగతా భాగాల్ని కూడా త్రీడీలోకి మార్చే యోచనలో ఉన్నారు.