బ్యాగ్రౌండ్ ని వదలని తమన్

Thaman doing extra work
Wednesday, February 12, 2020 - 13:30

థమన్ ఇప్పుడు స్వింగ్ లో ఉన్నాడు. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా అతని వెంట పడుతోంది. ఇంత క్రేజ్ దక్కినా కూడా... అందరికి అందుబాటులో ఉండాలి అనే తన పాలసీ మార్చుకోవడం లేదు. వెరీ గుడ్ అటిట్యూడ్. అప్పుడప్పుడు ఇతర సినిమాలకు కూడా పార్ట్ టైమ్ వర్క్ చేస్తుంటాడు తమన్. ప్రోమోలు, ప్రమోషనల్ మెటీరియల్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుంటాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు ఫుల్ లెంగ్త్ రీ-రికార్డింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇప్పుడు నాని-సుధీర్ బాబు కలిసి చేస్తున్న V సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. అయినప్పటికీ అతన్ని  సాంగ్స్ వరకే పరిమితం చేసి, రీ-రికార్డింగ్ వ్యవహారం మొత్తాన్ని తమన్ కు కట్టబెట్టాడు నిర్మాత దిల్ రాజు. ఒకప్పుడు ఇలాంటి "ప్రత్యేక" పనులు మణిశర్మ చేసేవాడు. ఇప్పుడలాంటి అవకాశాలన్నీ తమన్ కు వస్తున్నాయి.

ఇంతకుముందు  నాగచైతన్య-సమంత కలిసి చేసిన మజిలీ సినిమాకు ఇలానే పూర్తిస్తాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. అది కాస్తా సూపర్ హిట్టయింది. కాంచన-3 సినిమాకు కూడా ఆర్ఆర్ ఇచ్చాడు. ఇక సైరా మోషన్ పోస్టర్ టీజర్ కు, సాహో ప్రమోషనల్ స్టఫ్ కు కూడా తమనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వ్యవహారాలు చూస్తున్నాడు.

ఒకవైపు ఫుల్ లెంగ్త్ గా సినిమాలకు వర్క్ చేస్తూనే.. మరోవైపు ఇలాంటి ప్రాజెక్టులు కూడా ఒప్పుకుంటూ.. రెండు చేతులతో సంపాదిస్తున్నాడు తమన్.