షోలో 'సూపర్' అనిపిస్తున్న తమన్

సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మొట్టమొదటిసారిగా తెలుగు టెలివిజన్‌పై ‘సూపర్ జడ్జ్‌గా ఎంట్రీ ఇచ్చారు. సరికొత్త కోణంలో ప్రశంసలు అందుకుంటున్నారు తమనన్.. ఇటీవలే స్టార్ మా ప్రారంభించిన “సూపర్ సింగర్' షోకి తమన్ సూపర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పాటలు పాడాలన్న తపన ఉండి, కొన్ని కారణాల వల్ల పాడడం ఆపేసిన గాయనీగాయకుల కలలను తిరిగి కొనసాగించాలనే ఉద్దేశంతో స్టార్ మా టీవీ ప్రారంభించిన సూపర్ సింగర్' షో - తమన్ని కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసింది.
తమన్ ఎంతో మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తున్న తీరు, బ్యాలెన్స్‌తో మాడ్లాడుతున్న పద్దతకి సంగీత ప్రియులతోపాటు సాధారణ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
సహజంగా మృదుస్వభావి అయిన తమన్...ఎవరూ నొచ్చుకోకుండా, తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం విశేషం. తన ‘సూపర్ జడ్జ్' హెూదాకి తగినట్టుగా నమ్మకాన్ని నిలబెట్టుకునే స్థాయిలో తమన్ తనని తాను కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇప్పుడు స్టార్ మా షోలో ఒక కొత్త తమన్‌ని ఆడియన్స్ చూస్తున్నారు.
- Log in to post comments