ఆఖరి మెట్టు దగ్గర ఆగాయి

These films need just 20 days for shoot
Tuesday, July 28, 2020 - 13:30

లాక్ డౌన్ కారణంగా 'V' మూవీ రిలీజ్ కు జస్ట్ కొన్ని రోజుల ముందు థియేటర్లు బంద్ అయ్యాయి. అలా ఆఖరి నిమిషంలో ఆగిపోయిన పెద్ద సినిమాగా మిగిలిపోయింది 'V'. అయితే ఇలా ఆఖరి నిమిషంలో షూటింగ్ ఆగిపోయిన పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక్క 3 వారాలు కరోనా కనికరిస్తే ఈపాటికి ఆ సినిమాల ఫస్ట్ కాపీలు రెడీ అయి ఉండేవి. కానీ గుమ్మడికాయ కొట్టడానికి జస్ట్ కొన్ని రోజుల ముందు అవన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.

ఉదాహరణకు 'లవ్ స్టోరీ' సినిమానే తీసుకుంటే.. జస్ట్ 15 రోజుల ముందు ఈ సినిమా ఆగిపోయింది. కరోనా వస్తుందని తెలియక తనదైన స్టయిల్ లో నిదానంగా షూటింగ్ చేశాడు కమ్ముల. తీరా అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో, ఆఖరి నిమిషంలో షూటింగ్ ఆగిపోయింది.

Solo Brathuke Better and Krack

సాయితేజ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాది కూడా ఇదే పరిస్థితి. మరో 10 రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తారనగా షూటింగ్ ఆగిపోయింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా రిలీజై ఈపాటికి 3 నెలలయ్యేది. కానీ 10 రోజుల షూటింగ్ పెండింగ్ తో ఆగిపోయింది.

'క్రాక్' సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమాకు 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈలోగా లాక్ డౌన్ పడింది. రవితేజ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేడు. శృతిహాసన్ ముంబయిలోనే తిష్టవేసింది. ఇలా ఈ 3 సినిమాలు షూటింగ్ పూర్తవ్వడానికి కొన్ని రోజుల ముందు ఆగిపోయాయి.