దర్బార్ కోసం ముగ్గురు సూపర్ స్టార్లు

Three superstar to unveil Darbar motion poster
Wednesday, November 6, 2019 - 22:00

రజనీకాంత్ రూటు మార్చాడు. ఒకప్పుడు తన సినిమాలకు తనే బ్రాండ్ అంబాసిడర్. కానీ ఇప్పుడు తన సినిమాల్లో ఇతర హీరోల్ని కూడా కలుపుకుంటున్నాడు. ప్రచారం కోసం వాళ్లను కూడా వాడుకుంటున్నాడు. ఇప్పుడీ పద్ధతిని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లబోతున్నాడు రజనీకాంత్. తన అప్ కమింగ్ మూవీ దర్బార్ కోసం ఏకంగా ముగ్గురు సూపర్ స్టార్స్ ను రంగంలోకి దించుతున్నాడు.

రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు దర్బార్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఒకేసారి 3 భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ మోషన్ పోస్టర్ కోసం ముగ్గురు సూపర్ స్టార్లను రంగంలోకి దించారు. హిందీ వెర్షన్ సల్మాన్ ఖాన్, తమిళ వెర్షన్ ను కమల్ హాసన్, మలయాళం వెర్షన్ ను మోహన్ లాల్ రిలీజ్ చేయబోతున్నారు.

నిజానికి తమిళ వెర్షన్ ను కావాలంటే తనే రిలీజ్ చేయొచ్చు. కమల్ కంటే రజనీకాంత్ చేస్తేనే బజ్ ఎక్కువ. కానీ రజనీకాంత్ మాత్రం కమల్ ను ఆహ్వానించాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి మిస్ అయ్యారు. పనిలోపనిగా తెలుగు మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ తో లాంఛ్ చేయిస్తే లెక్క సరిపోయేది. ఎందుకో ఆ పని చేయలేదు రజనీ. తెలుగు మోషన్ పోస్టర్ ను కూడా కమల్ హాసన్ చేతులమీదుగానే లాంఛ్ చేయిస్తున్నాడు.