బిగ్ బాస్: ఇప్పుడు హీరోల వంతు

Tollywood heroes to step into Bigg Boss 4
Friday, July 17, 2020 - 13:15

బిగ్ బాస్ సీజన్-4 కోసం మొన్నటివరకు చాలామంది హీరోయిన్ల పేర్లు చక్కర్లుకొట్టాయి. వాటిలో ఎంతమంది ఫైనల్ అయ్యారనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నలుగురు హీరోల పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.

సీజన్-4 కోసం "ఆర్ఎక్స్100" ఫేమ్ కార్తికేయను సంప్రదించారట మేకర్స్. మరోవైపు "కృష్ణ అండ్ హీజ్ లీల" ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డకు కూడా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్లను ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఇదే కోవలో "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేం సుధాకర్, "గరుడవేగ"లో నటించిన అరుణ్ అదిత్ కు కూడా నిర్వహకులు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరవ్వడానికి ఒప్పుకున్నట్టు టాక్. సీజన్-4కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్-4 డేట్స్ బయటకురాబోతున్నాయి.