మహాకవి సినారెకి చిత్రసీమ నివాళి

మహాకవి డాక్టర్ సినారెకి తెలుగు చిత్రసీమ ఘన నివాళులు అర్పించింది. ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూశారు. ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. సినారె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
చిరంజీవి
సినారె భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. జీవిత కాలమంతా సినారె దర్పంగానే ఉంటూ.. మంచి జీవితాన్ని గడిపారన్నారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందారనే వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
బాలకృష్ణ
పోర్చుగల్‌లో ఉన్న బాలకృష్ణ సినారెతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినారె మృతి సాహితీ లోకానికే కాదు.. యావత్ తెలుగు జాతికి తీరని లోటు అని అన్నారు. నారాయణరెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని బాలకృష్ణ అన్నారు. ఆయన తెలుగుజాతి గర్వించదగిన ధ్రువతార అన్నారు.
వెంకటేష్
సినారె తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులుగా ఉండేవారని ప్రముఖ సినీనటుడు వెంకటేశ్ అన్నారు.
ఎన్టీఆర్
ఇది తెలుగు పాట మూగబోయిన వేళ! Dr.C.Narayana Reddy garu's contribution to Telugu language is peerless.This is a void that cannot be filled.
రానా
"నెలవంక తొంగి చూసింది అనేపాట మాకు అందించి నెల తిరక్కముందే తెర మరుగైన నిండు పౌర్ణమి సి నారె గారికి మా అశ్రునివాళి
- Log in to post comments