బడా దర్శకుల వెయిటింగ్ తిప్పలు

Top directors are waiting for heroes
Monday, July 13, 2020 - 16:30

కరోనా/లాక్ డౌన్ దెబ్బతో పెద్ద దర్శకులకు గొప్ప చిక్కొచ్చి పడింది. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న దర్శకులు లాక్ అయిపోయారు. బయట ఉన్న దర్శకులు హీరోల డేట్స్ దొరక్క సతమతమవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. దాదాపు బడా దర్శకుల పరిస్థితి ఇలానే ఉంది.

త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ తోనే. ఇది ఫిక్స్. కానీ అది ఎప్పుడంటే మాత్రం త్రివిక్రమ్ దగ్గరే సమాధానం లేదు. "ఆర్ఆర్ఆర్" ఓ కొలిక్కి వస్తే తప్ప త్రివిక్రమ్ అడుగు ముందుకేయలేడు.

హరీష్ శంకర్ ది ఇదే పరిస్థితి. పవన్ కల్యాణ్ తో సినిమా లాక్ అయింది. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయం మాత్రం చెప్పలేడు. ఎందుకంటే పవన్ సెట్స్ పైకి రావాలి. వచ్చిన తర్వాత "వకీల్ సాబ్" పూర్తిచేయాలి. క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాను కొంతైనా కొలిక్కి తేవాలి. అప్పటివరకు హరీష్ శంకర్ కు వెయిటింగ్ తప్పదు.

సైరాతో బడా డైరక్టర్స్ లిస్ట్ లో చేరిన సురేందర్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి. ప్రభాస్ తో మొదలుపెట్టి అఖిల్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్,  రామ్.. ఇలా అందరి వద్దకు రౌండ్లు వేస్తున్నాడు. ఏ హీరోతో మూవీ కన్ ఫర్మ్ అయినా  వెయిటింగ్ మాత్రం కామన్.