2019: బుల్లితెరపై మెరిసిన సినిమాలివే

Top rated movies of 2019 on small screen
Tuesday, December 31, 2019 - 16:00

ఏడాది గడిచిపోయింది. వెండితెరపై సక్సెస్ అయిన సినిమాలేంటో అందరికీ తెలుసు. మరి వీటిలో ఎన్ని సినిమాలు బుల్లితెరపై కూడా సక్సెస్ అయ్యాయి? వెండితెరపై హిట్ అయిన ప్రతి సినిమా టీవీల్లో హిట్టవ్వాలనే రూల్ లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహర్షి. మహేష్ నటించిన ఈ సినిమాకు టీవీల్లో అత్యల్ప టీఆర్పీ వచ్చింది మరి.

ఈ ఏడాది బుల్లితెర హిట్ మూవీగా ఎఫ్2 నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు బుల్లితెర వీక్షకులు కూడా ఫిదా అయ్యారు. స్టార్ మాలో ప్రసారమైన ఈ సినిమాకు ఏకంగా 17.38 (అర్బన్) రేటింగ్ కట్టబెట్టారు. ఈ మూవీ తర్వాత రెండో స్థానంలో ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీగా నిలిచిన ఈ సినిమా టీవీల్లో కూడా అత్యధిక రేటింగ్ (16.63) సాధించి వావ్ అనిపించుకుంది.

2019లో బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన తెలుగు సినిమాల లిస్ట్ ఇలా ఉంది. (అర్బన్ రేటింగ్స్)
1. ఎఫ్2 (స్టార్ మా) - 17.38
2. ఇస్మార్ట్ శంకర్ (జీ తెలుగు) - 16.63
3. కాంచన 3 (జీ తెలుగు) - 13.18
4. అరవింద సమేత (జీ తెలుగు) - 13.14
5. 2.O (జీ తెలుగు) - 12.55
6. టాక్సీవాలా (జీ తెలుగు) - 11.70
7. రాక్షసుడు (జెమినీ) - 9.84
8. సీత (స్టార్ మా) - 9.83
9. నోటా (స్టార్ మా) - 9.46
10. మహర్షి (స్టార్ మా) - 8.99