రిజ‌ల్ట్ నిర్మాత‌ల‌కి ముందే తెలుసా?

Touch Chesi Chudu: Producers knew that it would flop!
Sunday, February 4, 2018 - 22:00

ర‌వితేజ న‌టించిన "ట‌చ్ చేసి చూడు" ఊహించిన‌ట్లే అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. ఐతే ఈ రిజ‌ల్ట్‌ని నిర్మాత బుజ్జి ముందే ఊహించాడ‌ని ఇండ‌స్ట్రీ గుసగుస‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌విష‌యంలోనిర్మాత పెద్దగా ప‌ట్టించుకోలేదు. ఎందుక‌ని తీరా తీస్తే.. ఇది ఆడ‌దు అని ముందే ఫిక్స్ అయ్యాడ‌ట‌. 

సినిమా షూటింగ్ స‌గ‌భాగం అయిన త‌ర్వాత అటు ర‌వితేజ‌కి, ఇటు నిర్మాత బుజ్జికి సినిమా తేడా కొడుతోంద‌న్న విష‌యం అర్థం అయిపోయింద‌ట‌. అప్పుడు ర‌వితేజ కొద్ది రోజులు షూటింగ్ నిలిపివేశాడు. ఐతే మ‌రో నిర్మాత వ‌ల్ల‌భ‌నేని వంశీ...ప‌ట్టుబ‌ట్ట‌డంతో నెల రోజుల త‌ర్వాత షూటింగ్‌లో పాల్గొన్నాడు ర‌వితేజ‌. సినిమా విడుద‌లైన త‌ర్వాత క్రిటిక్స్ అంతా దాదాపుగా 2 - 2.5 రేంజ్‌లోనే రేటింగ్ ఇచ్చారు. అంటే ప‌ర‌మ బోరింగ్‌గా ఉంద‌ని అర్థం. క్రిటిక్స్‌తో పాటు జ‌నం టాక్ కూడా అదే రేంజ్‌లో ఉంది. అందుకే మొద‌టి ఆట త‌ర్వాత నుంచే డీలాప‌డింది సినిమా.

ర‌వితేజ ..రిలీజ్‌కి రెండు, మూడు రోజుల ముందు తెగ హ‌డావుడి చేశాడు. సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో లైవ్ చాటింగ్ చేశాడు. తొలి రోజు వైజాగ్‌లో ఏదో ఒక థియేట‌ర్‌లో జ‌నం మ‌ధ్య చూస్తా అని ప్ర‌క‌టించాడు. ఐతే విడుద‌లైన త‌ర్వాత ఒక్క మాట కూడా ట్వీట్ చేయ‌లేదు. రెండో ఇన్నింగ్స్‌లో ర‌వితేజ‌కి రెండో సినిమాతో బ్యాడ్ రిజ‌ల్ట్ వచ్చింది.