నైట్ లైఫ్ చాలా ఇష్టం: త్రిష

Trisha reveals her likes and dislikes
Thursday, May 14, 2020 - 14:30

తన ఆల్ టైమ్  ఫేవరెట్ సిరీస్ గా "సెక్స్ అండ్ ది సిటీ"ని చెప్పుకొచ్చింది త్రిష. లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ. చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మాట్లాడిన త్రిష.. చాలా విషయాల్ని షేర్ చేసుకుంది. త్రిష క్వారంటైన్ చిట్ చాట్ మీ కోసం.

- పుట్టినరోజు ఎలా గడిచింది?
ఇంట్లో కేరట్ కేక్ చేసుకున్నాం. చాలా బాగుంది

- పగలు ఇష్టమా.. రాత్రిళ్లు ఇష్టమా?
నాకు నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం

- ఇష్టమైన చాక్లెట్
twix చాక్లెట్

- BBA ఎందుకు చేశారు?
ఎందుకంటే నాకు మ్యాథ్స్, అకౌంట్స్ అంటే చాలా ఇష్టం

- కాస్మొటిక్ సర్జరీపై మీ అభిప్రాయం
కాస్మొటిక్ సర్జరీకి నేను పూర్తి వ్యతిరేకం. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లవి.

- ఇష్టమైన వెబ్ సిరీస్
సెక్స్ అండ్ ది సిటీ.. నా ఆల్ టైమ్ ఫేవరెట్

- లాక్ డౌన్ లో వ్యాయామం ఎలా?
రోజుకు 15 సార్లు మెట్లు ఎక్కి దిగుతున్నాను. నడుస్తూ కాల్స్ మాట్లాడుతున్నాను. సోషల్ మీడియా కూడా నడుస్తూనే.

- మీ లవ్ పార్టనర్ ను కలిశారా?
నా ప్రేమికుడ్ని ఇంకా కలవలేదు. సీతాకోక చిలుకల్లా ఆకాశంలా ఎగిరేలా అనిపించాలి. అదే ప్రేమంటే. అలాంటి ఫీలింగ్ ఇంకా రాలేదు.

- ఇష్టమైన నవలలు
ది డావిన్సీ కోడ్, ది కైట్ రన్నర్

- ఫేవరెట్ గేమ్
మోనోపొలీ

- ఇండియాలో ఇష్టమైన ముగ్గురు నటులు
కమల్ హాసన్, మోహన్ లాల్, అమీర్ ఖాన్

-  బాగా బాధగా అనిపిస్తే..?
బాగా బాధగా అనిపించినప్పుడు గోడకు చేరబడతాను.. లేదంటే పుస్తకం ఎక్కువసేపు చదువుతాను