పెళ్లి కబురు చెప్పనుందా?

Trisha's social media break and speculations
Wednesday, June 17, 2020 - 22:00

చెన్నై బ్యూటీ త్రిష సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని, కొన్నాళ్లు గ్యాప్ ఇస్తున్నానని చెప్పి మరీ ట్వీట్లు ఆపేసింది త్రిష. 5 రోజుల నుంచి ఆమె నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఇన్ స్టాగ్రామ్ లోనైతే అంతకంటే ముందు నుంచే పోస్టులు-ఫొటోలు ఆపేసింది. ఇదంతా పాత న్యూస్. 

ఐతే ఆమె బ్రేక్ గురించి ఇప్పుడు కొత్త ఊహాగానాలు సాగుతున్నాయి. ఎప్పుడైతే మళ్లీ ట్విట్టర్ లోకి వస్తుందో.. అప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇస్తుందని అంటున్నారు చాలామంది. అది కూడా ఆమె పెళ్లికి సంబంధించిన మేటరై ఉంటుందని కూడా చెబుతున్నారు. రానా పెళ్లికి రెడీ అయిపోవడంతో.. ఇక త్రిష కూడా రేపోమాపో పెళ్లి చేసుకుంటుందంటూ ఈమధ్య పుకార్లు వచ్చాయి. వాటికి బలం చేకూర్చేలా ఆమె సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా తప్పుకుంది.

రానా, త్రిష చాన్నాళ్లు డేటింగ్ చేశారు అనేది అందరికి తెలిసిన మ్యాటర్. రానా కూడా ఈ విషయాన్నీ బయటపెట్టాడు. ఇప్పుడు రానా మిహీక బజాజ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆగష్టు 8న పెళ్లి. సో... 37 ఏళ్ల త్రిష కూడా ఇప్పుడు సీరియస్ గా పెళ్లి గురించి థింక్ తోంది అని అంటున్నారు.

గతంలో ప్రియా వారియర్ ఎలాగైతే కావాలనే గ్యాప్ తీసుకుందో, త్రిష కూడా మానసిక ప్రశాంతత కోసం అలా గ్యాప్ తీసుకొని ఉంటుందనే మాట కూడా వినిపిస్తోంది. మళ్లీ ఆమె ఎప్పుడు వస్తుందో.. ఏ బ్రేకింగ్ న్యూస్ ఇస్తుందో...!