'గురూజీ' అతి పొగడ్తలు!

Trivikram goes overboard in praising Pawan Kalyan
Tuesday, January 28, 2020 - 11:15

"పవన్ ఊపిరి సలపనంత రాజకీయాలతో బిజీగా ఉన్నారు. తన సినిమానే ఆయన 3 నెలల తర్వాత చూస్తారు. అత్తారింటికి దారేది సినిమాను వంద రోజుల తర్వాత, ఎంతో బతిమాలితే చూశారు. అల వైకుంఠపురములో సినిమాను నెల లోపే చూస్తారని నేను అనుకుంటున్నాను. అలా జరిగితే అది అద్భుతమే. పవన్ ఎప్పుడూ మారరు. సినిమాలెప్పుడూ పవన్ కు సెకెండ్ ప్రయారిటీనే."

నిన్న జరిగిన అల వైకుంఠపురములో ప్రెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడిన మాటలివి. అల వైకుంఠపురములో సినిమాను పవన్ ఎప్పుడు చూస్తారనే ప్రశ్నకు త్రివిక్రమ్ పై విధంగా రెస్పాండ్ అయ్యారు. అతడి సమాధానం చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు. త్రివిక్రమ్ గతం మరిచిపోయి మాట్లాడాడని తమకుతాము సర్దిచెప్పుకున్నారు.

రామ్ చరణ్ చేసిన మగధీర సినిమా ప్రీమియర్ షోనే చూశాడు పవన్. ఆ తర్వాత చరణ్ చేసిన రంగస్థలం సినిమాను వారంలోపే చూసి మెచ్చుకున్నారనేది మనందరికీ తెలుసు. అంతెందుకు.. తను నటించిన అత్తారింటికి దారేది సినిమాను కూడా డబ్బింగ్ థియేటర్ లో, ఎడిట్ రూమ్ లో ఎన్నోసార్లు చూసే ఉంటాడు. ఈ విషయాల్ని త్రివిక్రమ్ మరిచిపోయినట్లేనా?

పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడని, వీలు చూసుకొని కచ్చితంగా అల వైకుంఠపురములో సినిమా చూస్తాడని అంటే సరిపోయేదు. మరో 3 రోజులు గడిస్తే ఎవరూ ఈ ప్రశ్న రిపీట్ చేయరు కూడా. అంతా మరిచిపోతారు. కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ విషయంలో కాస్త అతిగా స్పందించా.రు  అల వైకుంఠపురములో సినిమాను నెల రోజుల్లోపు చూస్తే అది అద్భుతమే అని త్రివిక్రమ్ అనడం అతికి పరాకాష్టగా మారింది. పవన్ కళ్యాన్ పొగడడంలో త్రివిక్రమ్ ఎప్పుడూ ఓవర్ ది బోర్డు వెళ్తారు....  జనం నవ్వుకుంటారు... ట్రోలింగ్ చేస్తారన్న విషయం పట్టించుకోకుండా.