నిర్మాత విష‌యంలో తేలని మేట‌ర్‌

Trivikram still undecided about producers
Saturday, November 10, 2018 - 09:30

త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ కాంబినేష‌న్ సెట్ అయింది. కానీ సినిమా గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అధికారికంగా రావ‌డం లేదు. త్వ‌ర‌లోనే మంచి క‌బురు చెపుతాన‌ని అభిమానుల‌కి మాట ఇచ్చాడు అల్లు అర్జున్‌. ఐతే ఇంకా ప్ర‌క‌ట‌న ఆల‌స్యం అవుతోంది. దానికి మెయిన్‌ రీజ‌న్‌.. నిర్మాత‌ల పేర్లు తేల్చ‌క‌పోవ‌డ‌మేన‌ట‌. 

గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే సినిమా చేయాల‌నేది అల్లు అర్జున్ ప్ర‌తిపాద‌న‌. ఒక ర‌కంగా ఒత్తిడి కూడా అనుకోవ‌చ్చు. కానీ త్రివిక్ర‌మ్‌కి - నిర్మాత రాధాకృష్ణ‌కి బాండింగ్ ఉంది. వ‌రుస‌గా హారిక హాసిన బ్యాన‌ర్‌కే మూవీస్ చేస్తూ వ‌స్తున్నాడు. ఇపుడు ఒక్క‌సారి గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చేస్తే.. ఆ త‌ర్వాత ఇత‌ర హీరోలు కూడా త‌మ‌కి న‌చ్చిన బ్యాన‌ర్‌లోనే చేయ‌మ‌ని ఒత్తిడి తేవ‌డం ఖాయం. బ‌న్నికి మాత్ర‌మే ఆ  వెసులుబాటు క‌ల్పించే ప‌రిస్థితి ఉండ‌దు. అందుకే త్రివిక్ర‌మ్ ఊగిస‌లాట‌లో ఉన్నాడు.

హారిక హాసిని బ్యాన‌ర్‌ని కూడా ఈ సినిమాలో క‌ల‌పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఒక నిర్మాణ సంస్థ ఉంటుందా? రెండు సంస్థ‌లు క‌లిపి తీస్తాయా అనేది ఫైన‌లైజ్ కాలేదు. ఈ వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తే ..వ‌చ్చే ప‌ది రోజుల్లో ప్ర‌క‌ట‌న రావొచ్చు. త్రివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ కాంబినేష‌న్లో సినిమా క‌న్‌ఫ‌మ్. కానీ అధికార‌క ప్ర‌క‌ట‌న ఇంకా లేట్‌. డిసెంబ‌ర్‌లో సినిమా ముహూర్తం ఉంటుంద‌నేది టాక్‌.