త్రివిక్రమ్ విడుదల చేసిన మొదటిపాట

Trivikram unveils Are Are song
Monday, November 25, 2019 - 13:30

ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ... 'మిస్ మ్యాచ్'. ఈ చిత్రంలోని మొదటిపాటని  దర్శకుడు త్రివిక్రమ్ ఈరోజు విడుదల చేశారు. 

త్రివిక్రమ్

'మిస్ మ్యాచ్' టైటిల్ కొత్తగానూ,ఆసక్తిని కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీమ్ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. 'మిస్ మ్యాచ్'  ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన 'అరెరే అరెరే' మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉంది

హీరో ఉదయ్ శంకర్
.నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ 'మిస్ మ్యాచ్' చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు. నా మొదటి సినిమా 'ఆట కదరా శివ' సినిమాకు త్రివిక్రమ్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 

నిర్మాత శ్రీరామ్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈరోజు విడుదల అయిన ఈ గీతం తరువాత మరో రెండు గీతాలను ఒకదాని తరువాత మరొకటి విభిన్నంగా విడుదల చేయబోతున్నాము అని తెలిపారు. 'ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ దర్శకుడు 'క్రిష్' చేతుల మీదుగా  విడుదల అయిన 'మిస్ మ్యాచ్' తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేసిన చిత్రం టీజర్, అలాగే ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసిన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకులనుంచి విశేషమైన స్పందన లభించింది.