అలా త్రివిక్రమ్ కల నెరవేరింది

Trivikram's dream has come true
Thursday, January 23, 2020 - 11:15

కమర్షియల్ బ్లాక్ బస్టర్ లు ఇవ్వలేడేమో అనుకున్న సుకుమారే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి ఖాతాలోనూ దాదాపు 100 కోట్ల షేర్ సాధించిన సినిమా పడింది. కొరటాల దూసుకెళ్తున్నారు . 2013 తర్వాత తాను పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేక పోతున్నానే అని బాధపడుతున్న త్రివిక్రమ్ కి... కాలం కలిసొచ్చింది.  అల వైకుంఠపురంలో సినిమాతో త్రివిక్రమ్ కూడా మరోసారి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. 

అలా త్రివిక్రమ్ కల నెరవేరింది. అత్తారింటికి దారిది తీసినప్పుడు ఇండస్ట్రీ నెంబర్ హిట్ ఆయన ఖాతాలో ఉంది. మళ్లీ ఇన్నేళ్లకి టాప్ 5 సినిమాల లిస్ట్ లో త్రివిక్రమ్ మూవీ వచ్చి చేరింది. నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇండియా సినిమా తీయడం, అల్-టైం హిట్ కొట్టడం...చూద్దాం మరి ఆ డ్రీం కూడా నెరవేరుతుందో. ఈ ఏడాది ఆయన ఎన్టీఆర్ తో కొత్త సినిమా షురూ చెయ్యనున్నారు.

మాటల మాంత్రికుడిగా ఆయన ఎప్పుడూ టాప్ లోనే ఉన్నారు. అయితే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ రేసులో ఇప్పుడు తిరిగి జాయిన్ అయ్యారు.