త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి కాదు

Trivikram's next is not for Sankranthi 2021
Wednesday, February 5, 2020 - 12:45

"అత్తారింటికి దారేది" తర్వాత డైరక్టర్ త్రివిక్రమ్ మళ్ళీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. డైరక్టర్ గా తన స్థానాన్ని మరోసారి టాప్ రేంజ్ తీసుకుపోయారు. ఈ సంక్రాంతికి "అల వైకుంఠపురంలో" భారీ హిట్ అయింది కాబట్టి... మళ్ళీ సంక్రాంతికే తన నెక్స్ట్ మూవీని రిలీజ్ చేస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, తెలుగుసినిమా.కామ్ కి తెలిసిన సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ ఈసారి తొందరపడటం లేదు.

కొంత రెస్ట్ తీసుకొని ...నెక్స్ట్ సినిమా మొదలు పెడదామని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ తదుపరి మూవీ ఎన్టీఆర్ తోనే. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు రాజమౌళి తీస్తున్న "ఆర్ ఆర్ ఆర్" మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతోంది. సో ...ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే ఫ్రీ అవలేడు. అందుకే... నెక్స్ట్ సంక్రాంతికి త్రివిక్రమ్ సినిమా రేస్ లో ఉండదు. వచ్చే సమ్మర్ కి ప్లాన్ చేసుకుంటారు అంట. 

అలాగే "ఆర్ ఆర్ ఆర్" రిలీజ్ డేట్ విషయంలోనూ డైలమా ఉంది. ఆ క్లారిటీ వస్తే... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయంలో కూడా క్లారిటీ వస్తుంది.