మాకు క్లాస్‌లు పీకొద్దు నాని!

Trollers do reverse trolling with Nani
Monday, July 23, 2018 - 17:45

తేజ‌స్వి బిగ్‌బాస్ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. ఎలిమినేష‌న్ ద్వారా ఆమెని బ‌య‌టికి పంపారు. ఆమెని ఎలిమినేట్ చేస స‌మ‌యంలో నాని కొన్ని మంచి మాట‌లు చెప్పాడు. ఏ వ్య‌క్తిపైనైనా ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు, అయిష్టం ఉండొచ్చు కానీ ఒక వ్య‌క్తి న‌చ్చ‌క‌పోయినంతా మాత్రానా వారి గురించి బ్యాడ్‌గా మాట్లాడ‌డం త‌ప్పు అని నాని అన్నాడు. ఆయ‌న చెప్పిన దాంట్లో త‌ప్పు లేదు.

ఐతే నాని తేజ‌స్విని తిట్టిన నెటిజ‌న్లని పీక‌డంలో చూపిన శ్ర‌ద్ద‌...ఆమెని ఎందుకు సెట్‌రైట్ చేయ‌లేద‌ని కామెంట్స్ వ‌స్తున్నాయిపుడు. బిగ్‌బాస్ హౌస్‌లో తేజ‌స్వి దారుణంగా బిహేవ్ చేసిందట‌. తోటీ కాంటెస్టెంట్‌ల‌ని ర‌క‌ర‌కాలుగా హేళ‌న చేసింద‌ట‌. కౌశ‌ల్‌ని ఆడిపోసుకుంద‌ని స‌మాచారం. ఇన్ని చేసినా..ఆమెని నాని మందలించ‌లేదు. ఆమెకి తీసుకోని క్లాస్‌, మాకేలా అంటూ నెటిజ‌న్లు ఇపుడు నానికి క్లాస్ పీకుతున్నారు.

నాని మీ నీతి సూక్తులు బాలేవు అంటూ ఆయ‌న్ని ట్రాల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. మొత్తానికి తేజ‌స్వి ఎలిమినేష‌న్ చాలా చ‌ర్చ‌కి దారితీసింది. బిగ్‌బాస్ షోకిపుడు రేటింగ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నాని యాంక‌రింగ్‌కి కూడా పేరు వ‌చ్చింది. ఇలాంటి చ‌ర్చ‌లు, ట్రాలింగ్‌లు ఈ షో పాపులారిటీకి అద్దం పడుతున్నాయి.