ఈవారం టాప్-5 సినిమాలివే

TV ratings July 18-24,2020
Thursday, July 30, 2020 - 13:30

కొత్త సినిమాల సందడి లేకపోవడంతో ఈవారం (జులై 18-24) స్మాల్ స్క్రీన్ పై రిపీటెడ్ సినిమాలే ఎక్కువగా కనిపించాయి. దీనికి తోడు క్రేజీ మూవీస్ ఏవీ టెలికాస్ట్ అవ్వకపోవడంతో ఉన్న సినిమాల్లోనే "ఛలో" మూవీ బెటర్ గా నిలిచింది.

ఈ వారం టీఆర్పీల్లో "ఛలో" సినిమాదే అగ్రస్థానం. జెమినీలో ప్రసారమైన ఈ సినిమాకు 5.78 (రూరల్+అర్బన్) రేటింగ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో జీ తెలుగులో ప్రసారమైన "ఆకాశగంగ-2" అనే డబ్బింగ్ మూవీ నిలిచింది. రమ్యకృష్ణ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాకు 4.85 టీవీఆర్ వచ్చింది.

మూడో స్థానంలో "సైరా" (4.55), నాలుగో స్థానంలో "90ఎంఎల్" (4.13), ఐదో స్థానంలో "బందోబస్త్" (4.05) నిలిచాయి. కార్తికేయ నటించిన "90ఎంఎల్" సినిమా టాప్-5 రేటింగ్స్ చార్ట్ లో నిలవడం ఇది నాలుగోసారి. సిల్వర్ స్క్రీన్ పై ఫెయిలైన ఈ సినిమా బుల్లితెరపై సూపర్ హిట్టయినట్టు లెక్క.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. స్టార్ మా ఛానెల్ మొదటి స్థానంలో నిలవగా.. జీ తెలుగు ఛానెల్ నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మూడో స్థానంలో ఈటీవీ నిలవగా.. జెమినీ ఛానెల్ నాలుగో స్థానానికి పడిపోయింది.