మళ్ళీ దుమ్మురేపిన మహేష్ మూవీ

TV ratings: Sarileru Neekevvaru continues its strong performance
Thursday, July 9, 2020 - 13:45

ఈ వారం (జూన్ 27 - జులై 3) బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా 2 కొత్త సినిమాలు ప్రసారమయ్యాయి. కానీ అవి ఏమాత్రం రేటింగ్స్ పై ప్రభావం చూపించలేకపోయాయి. ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సినిమాలే ఈ వారం కూడా తళుక్కుమన్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు" సినిమా కళ్లుచెదిరే టీఆర్పీ నమోదుచేసింది.

ఉగాది కానుకగా ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ ప్రసారం చేశారు. అప్పుడే దానికి భారీ రేటింగ్ వచ్చింది. అయితే సెకెండ్ టైమ్ ప్రసారం లో కూడా మహేష్ మూవీ క్లిక్ అవ్వడం విశేషం. 28వ తేదీ ఆదివారం జెమినీ టీవీలో ఈ సినిమాను ఇంకోసారి ప్రసారం చేస్తే.. ఈసారి ఏకంగా 14.81 (అర్బన్+రూరల్) టీఆర్పీ రావడం విశేషం. ఒక సినిమాకు రెండో సారి ఈ స్థాయిలో రేటింగ్ రావడం నిజంగా గొప్ప విషయం.

ఇక ఈ వారం టాప్-5 సినిమాల విషయానికొస్తే.. "సరిలేరు నీకెవ్వరు" తర్వాత రెండో స్థానంలో "నరసింహా" (5.26), మూడో స్థానంలో వెంకటేష్ "రాజా" (4.98), నాలుగో స్థానంలో విజయ్ నటించిన "విజిల్" (4.75)  సినిమాలు నిలిచాయి.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ లో భాగంగా ఈ వారం దుల్కర్ నటించిన "కనులు కనులు దోచాయంటే" అనే సినిమాను స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయగా.. జీ తెలుగు ఛానెల్ "జుమాంజీ-ది నెక్ట్స్ లెవెల్" సినిమాను ప్రసారం చేసింది. "కనులు కనులు దోచాయంటే" సినిమా రేటింగ్స్ లో టాప్-5లో (4.70) నిలవగా.. "జుమాంజీ"కు అత్యల్పంగా కేవలం 2.15 టీఆర్పీ వచ్చింది.