సైరా కంటే గద్దలకొండకే ఎక్కువ రేటింగ్

TV ratings of Sye Raa and Gaddhalakonda
Thursday, January 23, 2020 - 17:45

ఈసారి బుల్లితెర రేటింగ్స్ లో ఓ వింత జరిగింది. మెగాస్టార్ సినిమా కంటే అతడి మేనల్లుడు సాయితేజ్ సినిమాకు కాస్త ఎక్కువ రేటింగ్ వచ్చింది. సంక్రాంతి కానుకగా సైరా సినిమాను జెమినీ టీవీలో ప్రసారం చేస్తే 10.58 (అర్బన్+రూరల్) టీఆర్పీ వచ్చింది. ఇక సంక్రాంతికి 2 రోజుల ముందు స్టార్ మాలో ప్రసారం చేసిన గద్దలకొండ గణేష్ కు 10.76 (అర్బన్+రూరల్) రేటింగ్ రావడం విశేషం.

నిజానికి స్టార్ మా, జెమినీ టీవీ మధ్య రీచ్ లో చిన్నపాటి వ్యత్యాసం ఉంది. కానీ ఇక్కడ రీజన్ అది కాదు. గద్దలకొండ గణేష్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో (హాట్ స్టార్) వచ్చినప్పటికీ అది పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు. కానీ సైరా అలా కాదు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమాను చాలామంది ఇప్పటికే చూసేశారు. రేటింగ్ పై ఈ ఎఫెక్ట్ కూడా పడింది.

ఇక ఇదే వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారమైన బందోబస్త్ సినిమాకు కేవలం 4.87 రేటింగ్ వచ్చింది. థియేటర్లలో ఫ్లాప్ అయినట్టుగానే బుల్లితెరపై కూడా సూర్య నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఎఫ్2, ఇస్మార్ట్ శంకర్, మహర్షి సినిమాలు రిపీట్స్ లో కూడా మంచి రేటింగ్స్ సాధించాయి.