టీవీ షూట్స్ పై బిగ్ బి ఎఫెక్ట్

TV shoots to be stalled again
Monday, July 13, 2020 - 18:15

"ప్రపంచానికి దూరంగా ఖరీదైన విల్లాలో ఉంటూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తికే కరోనా సోకింది. ఇక మనమెంత, మన బతుకెంత."

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది ఇదే ఫీల్ అవుతున్నారు. ఈ మేరకు కొన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. బిగ్ బి ప్రభావం టాలీవుడ్ నటీనటులపై ఎంత పడిందో చెప్పలేం కానీ, ఇద్దరు యాంకర్స్ మాత్రం ఈ దెబ్బతో తమ ప్లాన్స్ అన్నీ పక్కన పడేశారు.

అవును.. బిగ్ బికి కరోనా సోకడంతో యాంకర్లు అనసూయ, సుమ తమ ప్లాన్స్ అన్నీ మార్చేశారు. షూటింగ్స్ మళ్లీ మొదలైన తర్వాత అనసూయ జబర్దస్త్ స్టార్ట్ చేసింది. అటు సుమ.. క్యాష్ అనే కార్యక్రమం ప్రారంభించడంతో పాటు ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా కూడా వెళ్లింది.

అయితే ఎప్పుడైతే మళ్లీ కేసుల ఉధృతి పెరిగిందో, మరోవైపు అమితాబ్ లాంటి వారికే కరోనా సోకిందని తెలిసిందో వీళ్లిద్దరూ వెనకడుగు వేశారు. కొన్ని రోజుల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాలని అనసూయ, సుమ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కరోనా కారణంగా కొన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు వీళ్లు కూడా ఆగిపోతే.. కీలకమైన కార్యక్రమాలు కూడా నిలిచిపోతాయి.