'వి'కి ఎందుకు భయపడట్లేదు?

Two more films are competing with Nani's V
Saturday, March 7, 2020 - 13:30

మార్చి నెల అంటేనే డల్ పీరియడ్. తెలుగు సినిమాలు పెద్దగా రిలీజ్ కావు. కానీ సమ్మర్ సెలవుల సీజన్ మాత్రం మార్చి చివర్లో మొదలవుతుంది. ఈసారి పండగ కూడా కలిసొచ్చింది. ఉగాది పండగ స్పెషల్ గా ఈ నెల 25న నాని, సుధీర్ బాబు నటించిన "వి" సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని నాలుగు నెలల క్రితమే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. 

సమ్మర్ సీజన్ కి బోణి కొట్టే పెద్ద సినిమా కింద లెక్కే. జనరల్ గా నాని వంటి మంచి స్టార్ డమ్ ఉన్న హీరో నటించిన సినిమా విడుదల రోజు, ఇతర చిన్న సినిమాలు పోటీ పడకూడదు. జంకాలి. కానీ అసలే ఫ్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ కానీ, హీరోగా లక్ టెస్ట్ చేసుకుంటున్న ప్రదీప్ కానీ నాని సినిమాకి భయపడడం లేదు. ఆ సినిమాకి పోటీగా తమ సినిమాలని థియేటర్లలోకి తెస్తున్నారు. 

బుల్లితెరపై బాగా సందడి చేసే ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి నటించిన తొలి చిత్రం.... "30 రోజుల్లో ప్రేమించడం ఎలా". ఈ మూవీని కూడా మార్చ్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అంటే ... నాని మూవీకి ఇది పోటీ. కాంపీటీషన్ కి భయపడడం లేదు. 

అలాగే రాజ్ తరుణ్ నటించిన "ఒరేయ్ బుజ్జిగా" సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది. వరుసగా ఫ్లాపులతో బాధపడుతున్న రాజ్ తరుణ్ కూడా నాని సినిమా విడుదల నాడే తన మూవీతో ఢీ అనడం విచిత్రంగా ఉంది. 

నాని సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇంద్రగంటి డైరెక్షన్, దిల్ రాజు ప్రొడక్షన్... టీజర్ అదిరిపోయింది.... అయినా పోటీకి రెండు సినిమాలు రావడం విశేషం.