మక్కికిమక్కి దింపినట్టున్నారుగా!

Uma Maheshwara xerox copy of Mahishinte
Friday, February 21, 2020 - 20:30

శివరాత్రి కానుకగా ఈరోజు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా టీజర్ రిలీజైంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా డైరక్ట్ మూవీ కాదు. మలయాళంలో హిట్టయిన మహేశంతే ప్రతీకారమ్ అనే సినిమాకు రీమేక్ గా వస్తోంది. ఈరోజు రిలీజైన టీజర్ చూస్తుంటే.. ఎలాంటి మార్పుచేర్పులు చేయకుండా సినిమాను మక్కికిమక్కి దింపారనే విషయం అర్థమౌతోంది.

మలయాళంలో ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించాడు. మూవీలో అతడి గెటప్ ఎలా ఉంటుందో.. తెలుగు వెర్షన్ లో సత్యదేవ్ గెటప్ ను కూడా యాజ్ ఇటీజ్ దించేశారు. చివరికి కలర్ టిల్ట్ విషయంలో కూడా ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఉన్నది ఉన్నట్టు మెయింటైన్ చేసినట్టున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఆ ఒరిజినల్ ఫీల్ ను తెలుగులో కూడా రీక్రియేట్ చేశారాలేదా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే.. మలయాళంలో ఆ సినిమా ఎమోషనల్ గా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఫాజిల్ యాక్టింగ్ అద్భుతం. క్లైమాక్స్ ఫైట్ లో ఫాజిల్ ప్రాణం పెట్టాడనే చెప్పాలి. అంతటి మేజిక్ ను తెలుగులో పునఃసృష్టి చేయగలరా అనేది చూడాలి.

రీసెంట్ గా జాను విషయంలో ఈ పునఃసృష్టి కాన్సెప్ట్ బెడిసికొట్టింది. తమిళ్ లో కల్ట్ లవ్ స్టోరీగా పేరుతెచ్చుకున్న ఈ 96 అనే ప్రేమకథను తెలుగులో యాజ్ ఇటీజ్ గా తీశారు. ఇంకా చెప్పాలంటే హానెక్ట్ రీమేక్ చేశారు. అయినప్పటికీ రిజల్ట్ తేడా కొట్టేసింది. అలాంటి మరో నిజాయితీ ప్రయత్నమే ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈసారి రిజల్ట్ ఏమౌతుందో చూడాలి. కేరాఫ్ కంచరపాలెం డైరక్టర్ వెంకటేష్ మహాకు ఇది రెండో సినిమా.