'ఉంగరాల' భామ ఉంగరం మార్చుకొంది

Ungarala Rambabu Miya George gets engaged
Tuesday, June 2, 2020 - 13:45

'ఉంగరాల రాంబాబు' సినిమా గుర్తుందా? చాలా మంది ఈ పేరు కూడా విని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది అట్టర్ ప్లాప్ మూవీ. సునీల్ హీరోగా నటించిన ఈ కామెడీ మూవీ ఘోరంగా పరాజయం కావడమే కాదు క్రిటిక్స్ తో కూడా చీవాట్లు వేయించుకొంది. ఇంతకీ ఇప్పుడు ఈ మూవీ ప్రస్తావన ఎందుకంటే.. ఈ సినిమాలో నటించిన మియా జార్జ్ ... పెళ్లికి రెడీ అయింది. ఆమె నిశితార్థం కూడా సైలెంట్ గా జరిగింది.

కేరళకి చెందిన మియా జార్జ్ ...మలయాళంలో పాతిక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళంలో కూడా అర డజన్ చిత్రాల్లో అందచందాలు ప్రదర్శించింది. తెలుగులో మొదటి సినిమా దెబ్బ తినడంతో మళ్ళీ ఛాన్స్ రాలేదు. ఈ భామ...కేరళకి చెందిన ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటోంది. అశ్విన్ ఫిలిప్ అనే బిజినెస్ మేన్ తో ఈ లక్డౌన్ పీరియడ్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. కరోనా కారణంగా చడీ చప్పుడు లేకుండా. ఎవరిని ఆహ్వానించకుండా నిశ్చితార్థం చేసుకున్నారట.

పెళ్లి ముహూర్తం సెప్టెంబర్ లో ఫిక్స్ చేసుకుంటున్నారట.