దీనికే క్లారిటీ లేదు.. నెక్స్ట్ రెండంట

Unnecessary hype on Naga Chaitanya's next films
Monday, July 13, 2020 - 15:15

నాగచైతన్య నటిస్తోన్న "లవ్ స్టోరీ" ఎపుడు రిలీజ్ అవుతుంది? దీనిపై దర్శకుడు కమ్ములకే క్లారిటీ లేదు. ఇది పూర్తి కాకముందే... చైతన్య నెక్స్ట్ ఇయర్ ఇంకో రెండు సినిమాలు విడుదల చేస్తాడనే ప్రచారం మొదలైంది. లాక్ డౌన్ వల్ల లవ్ స్టోరీ సినిమా విడుదలకే క్లారిటీ లేదని మేకర్స్ కిందా మీదా పడుతుంటే.. నాగచైతన్య మరో 2 సినిమాలు చేయబోతున్నాడంటూ కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారు.

నాగచైతన్య ఇలా వరుసగా సినిమాలు చేయబోతున్నాడంటూ మొదలైన ప్రచారం వెనక గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. ఆ మధ్య నాగచైతన్య-పరశురామ్ సినిమా అన్నారు. అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా వచ్చేసింది. అంతలోనే మహేష్ బాబు సినిమా వైపు పరశురామ్ షిఫ్ట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల లిస్ట్ వదుల్తున్నారు. 

విక్రమ్ కుమార్ తో చాన్నాళ్లుగా కథాచర్చలు జరుపుతున్నాడు నాగచైతన్య. అలాగే నలుగుతున్న ఇంద్రగంటి మోహనకృష్ణ పేరును కూడా సరిగ్గా టైమ్ చూసి మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే "లవ్ స్టోరీ" ఓ కొలిక్కి వచ్చేవరకు, దాని రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యేంతవరకు చైతూ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రాదు.

ఆ తర్వాత విక్రమ్ కుమార్ "థాంక్యూ" మొదలవుతుందా... ఇంద్రగంటి కథ రెడీ అవుతుందా అనేది మాట్లాడుకోవచ్చు.